搜索
热搜: music
门户 Culture Language view content

నస్రుద్దీన్

2015-6-8 23:44| view publisher: amanda| views: 4361| wiki(57883.com) 0 : 0

description: ముల్లా నస్రుద్దీన్, Nasreddin (పర్షియన్ ملا نصرالدین, అరబ్బీ: جحا తర్జుమా: జొహా ,نصرالدين అర్థం "విశ్వాస విజయం", టర్ ...
ముల్లా నస్రుద్దీన్, Nasreddin (పర్షియన్ ملا نصرالدین, అరబ్బీ: جحا తర్జుమా: జొహా ,نصرالدين అర్థం "విశ్వాస విజయం", టర్కిష్ నస్రెద్దీన్ హోకా, ఒక సూఫీ మరియు హాస్యభరితమైన విద్వాంసుడు. ఇతడు మధ్య యుగంలో 13వ శతాబ్దంలో అక్సెహీర్ మరియు కోన్యా లలో సెల్జుక్ ల కాలంలో జీవించాడు. [1] కానీ దగ్గరి తూర్పు దేశాలు, మధ్యప్రాచ్యము, మరియు మధ్య ఆసియా దేశాలు, ఉజ్బెగ్ లు ముల్లా నస్రుద్దీన్ తమ వాడేనంటూ చెప్పుకొంటారు. [2] [3] [1] [4][5][3][1] [6]).
నస్రుద్దీన్ చిత్రం

నస్రుద్దీన్ ప్రఖ్యాతి

ఇతనికి అనేక బిరుదులు ఉన్నాయి - "హోద్జా", ముల్లాహ్ లేదా ఎఫెందీ వంటివి. ఇతడు ప్రసిద్ధి చెందిన విద్వాంసుడు, సూఫీ, కవి మరియు పండితుడు. ఉయిఘుర్ టర్కీ ప్రజలలో జానపద హీరో. చైనా లో కూడా ఆఫందీ లేదా ఎఫెంటీ అనే పేరుతో ప్రసిద్ధి. [7][8][9]

నస్రుద్దీన్ పనులను చూసి ఎవరైనా ఇతనికి పిచ్చివాని క్రింద జమకట్టేవారు. కాని ఇతని చేష్టల హేతువులను చూసి పండితులు సైతం ముక్కు మీద వేలేసుకొనేవారు. ఇతను తను చేసే ప్రతి పనినీ లేదా సంభాషణనూ హేతువుతోనూ తర్కంతోనూ చేసేవాడు. సాదా సీదా జీవనం గడిపిననూ వేదాంతిగా, హాస్యరసజ్ఞుడిగా, ఛలోక్తులు విసిరేవాడిగా, విమర్శకులను సైతం మాటలుడిగేలా చేసేవాడు.
నస్రుద్దీన్ పుట్టుక మరియు చరిత్ర
గాడిదపై వెనుకవైపు తిరిగి కూర్చున్న నస్రుద్దీన్

ముల్లా నస్రుద్దీన్ అనటోలియా లో జీవించాడు; 13వ శతాబ్దంలో 'సివ్రీహిసార్' లోని 'హోర్తూ' గ్రామంలో జన్మించాడు. తరువాత, అక్సెహీర్ లో స్థిరనివాసమేర్పరచుకొన్నాడు, తరువాత 'కోన్యా' కు తన నివాసాన్ని మార్చి అక్కడే మరణించాడు. [6][10]

"అంతర్జాతీయ నస్రుద్దీన్ హోద్జా ఉత్సవాలు" అక్సెహీర్ లో ప్రతి సంవత్సరము జూలై 5-10 వరకూ జరుగుతాయి.[11] ఆధునిక కాలంలో ఇతని గురించి అనేక కథలూ, వివిధ తరగతులలో పాఠ్యాంశాలలోనూ చూడవచ్చును. [12] తెలుగులోనూ అనేక కథలు చూడవచ్చును. ఇతని పాత్ర చిత్రణ వివిధ భాషలలో, ఉదాహరణకు, అల్బేనియన్, అరబ్బీ, అజేరీ, బెంగాలీ, బోస్నియన్, హిందీ, పష్తో, పర్షియన్, సెర్బియన్, టర్కిష్ మరియు ఉర్దూ భాషల జానపదాలలోనూ, కథలలోనూ, హాస్య సాహిత్యాలలోనూ చూడవచ్చును. గ్రీసు లోనూ బల్గేరియా లోనూ ఇతడు ప్రసిద్దే.
నస్రుద్దీన్ కథలు
సూఫీ తత్వము మరియు తరీకా
Shrine of Abdul Qadir Jilani..jpg
ఆలోచనలు[చూపు]
ఆచరణలు[చూపు]
సూఫీ తరీకాలు[చూపు]
ప్రాచీన ప్రముఖ సూఫీలు[చూపు]
నవీన కాలంలోని ప్రముఖ సూఫీలు[చూపు]
సూఫీతత్వ విషయాలు[చూపు]
Portal Mosque02.svg పోర్టల్

    చూ
    చ
    మా

నస్రుద్దీన్ కథలు ప్రపంచ మంతటా ప్రసిద్ధి, ముఖ్యంగా మధ్యప్రాచ్యంలో. నస్రుద్దీన్ కథలు వ్యంగమునకు వ్యంగోక్తులకు, హాస్యమునకు, తర్కము మరియు విజ్ఞానానికి మచ్చు తునకలు.[13] కడుపుబ్బ నవ్వించే ఇతని కథలు, ముల్లా దో పియాజా, బీర్బల్ , తెనాలి రామకృష్ణ లను గుర్తుకు తెస్తాయి.

ఇతడి కథలలో సూఫీతత్వము, వేదాంతము కానవస్తుంది. ఈ కథలకు చెందిన అతిప్రాచీన వ్రాత ప్రతి 1571 లో కనుగొనబడింది.
ఇతని హాస్యోక్తులకు ఉదాహరణలు
ఖుత్బా ప్రసంగము

    ఓసారి నస్రుద్దీన్ ఖుత్బా ప్రసంగానికి ఆహ్వానింప బడ్డాడు. ఖుత్బా ఇవ్వడానికి మింబర్ పై నిల్చుని ఇలా అడిగాడు "నేనేమి చెప్ప దలచుకొన్నానో మీకు తెలుసా?", ప్రేక్షకులు జవాబిచ్చారు "లేదు" అని, అతనన్నాడు "కనీసం నేను ఏమి చెప్పదలచుకొన్నానో తెలియనివారికి నేనేమీ చెప్పదలచుకోలేదు" అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు.
    ప్రజలు అయోమయంలో పడ్డారు, ఇంకోసారి ఇతడిని ఆహ్వానించారు. ఈసారీ ఇతను అదే ప్రశ్న వేశాడు, ప్రేక్షకులు "అవును" అని జవాబిచ్చారు. నస్రుద్దీన్ ఈ విధంగా అన్నాడు, "మంచిది, నేనేమి చెప్పదలచుకొన్నానో మీకు తెలుసు కాబట్టి, మరలా ప్రసంగించి, నా సమయాన్ని వృధా చేయదలచుకోలేదు" అని అక్కడ నుండి వెళ్ళిపోయాడు.

    ప్రజలకు చికాకు వచ్చింది, వీరొకటి నిర్ణయించి, మరలా నస్రుద్దీన్ కు ఆహ్వానించారు. ఈసారీ నస్రుద్దీన్ అదే ప్రశ్న సంధించాడు - "నేనేమి చెప్ప దలచుకొన్నానో మీకు తెలుసా?", ప్రేక్షకులు తమ నిర్ణయానుసారం, సగం మంది "అవును" అని, మిగతా సగం మంది "లేదు" అని జవాబిచ్చారు. నస్రుద్దీన్ ఇలా అన్నాడు "తెలిసిన వారు సగం మంది, తెలియని సగం మందికి చెప్పివెయ్యండి" అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయారు!

నదికి ఇరువైపులు

    ముల్లా నస్రుద్దీన్ ఓ సారి, ఓ నది ఒడ్డున కూర్చొని వున్నాడు, అవతలి ఒడ్డుపై నిలుచున్న ఓ వ్యక్తి కేకపెట్టాడు;
    - "ఏమండీ! నేను అవతలి ఒడ్డుకు ఎలా రావాలి?"
    - "నీవు ఇవతలి ఒడ్డుకు రావాలంటే, అవతలి ఒడ్డున ఉండాలి!" ముల్లా బిగ్గరగా జవాబిచ్చాడు.

నీవెవరిని నమ్ముతావు

    ఒక పొరుగువాడు ముల్లా నస్రుద్దీన్ ను కలవడానికొచ్చాడు, ముల్లా బయటికొచ్చి అతడితో మాట్లాడాడు.
    పొరుగు వాడు ముల్లాతో "అన్యధా భావింపక" "ఈరోజు ప్రక్క వూరికి సరుకులు తీసుకెళ్ళాలి, మీ గాడిదను ఇస్తారా?"
    పొరుగువానికి తన గాడిదను ఇవ్వడం ఇష్టంలేక, సౌమ్యంగా:
    "క్షమించండి, ఇప్పటికే నా గాడిదను ఇతరులకిచ్చాను" అన్నాడు.
    ఇంతలోనే గాడిద గోడ ఆవలి నుండి గట్టిగా ఓండ్రపెట్టింది.
    "మీరు నాతో అబద్ధాలాడారు ముల్లా" "గాడిద గోడకు ఆవలే వుంది!" పొరుగువాడు అన్నాడు.
    "మీ ఉద్దేశ్యం ఏమిటి?" ముల్లా అసహనంగా జవాబిచ్చాడు. "మీరు ఎవరిని నమ్ముతారు, గాడిదనా లేదా ముల్లానా?"

యునెస్కో (UNESCO)

ముల్లా నస్రుద్దీన్ కు చెందిన అనేక కథలు అనేక భాషలలో కలవు. ఇవి ప్రపంచ మంతయూ ప్రసిద్ధి చెందినవి. ఇతని గౌరవార్థం, యునెస్కో వారు 1996-1997 వ సంవత్సరాన్ని, "అంతర్జాతీయ నస్రుద్దీన్ సంవత్సరం" గా ప్రకటించారు. యునెస్కో వారి అధికారిక సైట్
బుఖారా లో నస్రుద్దీన్ హోద్జా.
సంగ్రహాలు

    పర్షియాకు చెందిన మహమ్మద్ రమజాని, ముల్లా నస్రుద్దీన్ కు చెందిన 600 కథలను, కథానికలను సంగ్రహించాడు.
    ఇద్రీస్ షా, ముల్లా నస్రుద్దీన్ కథలను ప్రచురించాడు.
    షాహ్ రుఖ్ హుసేన్, 'నస్రుద్దీన్ తెలివి' అనే పుస్తకాన్ని ప్రచురించాడు.

ఇతర పేర్లు

నస్రుద్దీన్ కు ఇతర అనేక నామాలతోనూ గుర్తిస్తారు. ఉదాహరణకు : 'నస్రుదీన్', 'నస్ర్ ఉద్దీన్', 'నస్రెద్దీన్', 'నసీరుద్దీన్', 'నస్త్రదీన్', 'నస్త్రదిన్', 'నస్రతీన్', 'నుస్రతీన్', మరియు 'నస్తెదిన్'. భారతదేశం లోని సాహిత్యాలలో ఇతనికి ముల్లా నస్రుద్దీన్ లేదా ముల్లా నసీరుద్దీన్ పేరుతో పరిచయం గలదు.

About us|Jobs|Help|Disclaimer|Advertising services|Contact us|Sign in|Website map|Search|

GMT+8, 2015-9-11 20:14 , Processed in 0.132036 second(s), 16 queries .

57883.com service for you! X3.1

返回顶部