ఒక జనాభాలో సభ్యుల గురించి సమాచారాన్ని క్రమపద్ధతిలో సేకరించే మరియు నమోదు చేసే ప్రక్రియను జనాభా గణన (ఆంగ్లం: Census) అంటారు. ఇది ఒక నిర్దిష్ట జనాభాకు సంబంధించి జరిగే నియతకాలిక మరియు అధికారిక గణన.[1][2] జాతీయ జనాభా మరియు గృహ గణనలకు సంబంధించి ఈ పదాన్ని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు; వ్యవసాయ, వ్యాపార మరియు ట్రాఫిక్ గణనలను ఇతర సాధారణ గణనలుగా చెప్పవచ్చు. ఇటువంటి గణనల్లో "జనాభా"కు సంబంధించిన అంశాలు ప్రజలకు బదులుగా మొక్కలు, వ్యాపారాలను సూచిస్తాయి. జనాభా మరియు గృహ గణనలకు సంబంధించిన ముఖ్యమైన లక్షణాలను ఐక్యరాజ్యసమితి "ఒక గుర్తించిన భూభాగంలో వ్యక్తిగత గణనం, సాధారణత, సమకాలికత్వం మరియు నిర్ణీత నియతకాలికత"గా గుర్తించింది, మరియు కనీసం 10 ఏళ్లకు ఒకసారి జనాభా గణనలు సేకరించాలని సిఫార్సు చేసింది.[3] సెన్సస్ (జనాభా గణన) అనే పదాన్ని లాటిన్ నుంచి స్వీకరించారు: రోమన్ రిపబ్లిక్ సమయంలో జనాభా గణన అనేది సైనిక సేవలకు యోగ్యమైన యువకులను గుర్తించే ఒక జాబితాగా ఉండేది. ప్రతిచయనానికి జనాభా గణన భిన్నంగా ఉంటుంది, ప్రతిచయనంలో సమాచారాన్ని ఒక జనాభా యొక్క ఉపసమితి నుంచి సేకరిస్తారు, కొన్నిసార్లు ఒక జనాభా అంతర అంచనాగా దీనిని సేకరించడం జరుగుతుంది. జనాభా గణన సమాచారాన్ని సాధారణంగా పరిశోధన, వ్యాపార మార్కెటింగ్ మరియు ప్రణాళికా రచనలతోపాటు ప్రతిచయన అధ్యయనాలకు ప్రాతిపదికగా ఉపయోగిస్తారు. కొన్ని దేశాల్లో, జనాభా గణన సమాచారాన్ని ఎన్నికల ప్రాతినిధ్యాన్ని విభజించేందుకు (ఉదాహరణ కు వివాదాస్పదమైన -ఉతా - ఎవాన్స్ కేసు ను చూడండి) ఉపయోగిస్తారు. గోప్యత ఒక జనాభా గురించి గణాంక సమాచారాన్ని సేకరించేందుకు జనాభా గణన ఒక ఉపయోగకరమైన మార్గాన్ని అందించినప్పటికీ, కొన్నిసార్లు ఇటువంటి సమాచారం రాజకీయంగా లేదా మరోరకంగా వేధింపులకు దారితీయడంతోపాటు, అనామక జనాభా గణన సమాచారానికి వ్యక్తిగత గుర్తింపులు జోడించడాన్ని సాధ్యపరుస్తుంది.[4] సూక్ష్మసమాచార రూపంలో వ్యక్తిగత జనాభా గణనల స్పందనలను బహిర్గతం చేసినప్పుడు ఈ పరిగణన చాలా ముఖ్యమైన అంశంగా ఉంటుంది, అయితే చిన్న ప్రదేశాలు మరియు/లేదా ఉపజనాభాల విషయంలో మొత్తం-స్థాయీ సమాచారం కూడా గోప్యత ఉల్లంఘనలకు దారితీయవచ్చు. ఉదాహరణకు, ఒక పెద్ద నగరం నుంచి సమాచారాన్ని నివేదిస్తున్నప్పుడు, 50 మరియు 60 ఏళ్ల మధ్య వయస్సున్న నల్లజాతి పురుషుల యొక్క సగటు ఆదాయం ఇవ్వడం సమంజసంగా ఉంటుంది. అయితే, ఇదే పద్ధతిని ఒక పట్టణంలో అమలు చేసినప్పుడు, పై వయస్సు నడుమ ఇద్దరు నల్లజాతి పౌరులే ఉన్నట్లయితే గోప్యత ఉల్లంఘనకు వీలు ఏర్పడుతుంది, ఎందుకంటే వారిలో ఎవరో ఒకరి వ్యక్తిగత ఆదాయం మరియు నివేదించిన సగటు తెలుసుకున్నట్లయితే, మరో వ్యక్తి ఆదాయాన్ని గుర్తించవచ్చు. ఎక్కువగా ఇటువంటి వ్యక్తిగత సమాచారాన్ని రహస్యంగా ఉంచుతూ, జనాభా గణన సమాచారాన్ని సేకరిస్తారు. కొన్ని సంస్థలు ఉద్దేశపూర్వకంగా చిన్న గణాంక దోషాలను చేరుస్తాయి, తద్వారా తక్కువ సంఖ్యలో ఉన్న జనాభాల్లో వ్యక్తుల గుర్తింపును తెలుసుకునే వీలు లేకుండా చేస్తాయి;[5] ఇతర సంస్థలు ఒకేవిధమైన జవాబుదారుల మధ్య చరాంకాలను తారుమారు చేస్తాయి. జనాభా గణన సమాచారంలో గోప్యత ఉల్లంఘన భయాన్ని తగ్గించేందుకు ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ, సున్నితమైన వ్యక్తిగత సమాచార భద్రతకు, మెరుగైన సమాచార ఎలక్ట్రానిక్ విశ్లేషణ యొక్క కొత్త సాంకేతిక పరిజ్ఞానం నుంచి సవాళ్లు పెరుగుతూనే ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం నేరుగా సమిష్టి సమాచారాన్ని తెలియజేయడం మినహా, ఎటువంటి ఇతర సమాచారాన్ని బహిర్గతం చేయకుండా ఉండటం మరో పద్ధతి. పురాతన మరియు మధ్యయుగ ఉదాహరణలు ఈజిప్టు ఈజిప్టులో జనాభా గణనలను ప్రారంభ ఫారాహ్‌ల (రాజులు) యుగంలో 3340 BC మరియు 3050 BC సంవత్సరాల్లో సేకరించినట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్ బైబిల్‌లో జనాభా గణనకు సంబంధించిన ప్రస్తావన ఉంది: ఈజిప్టు నుంచి భారీ సంఖ్యలో ప్రజల వలస సందర్భంగా ఇజ్రాయెల్ జనాభాను లెక్కించడానికి బుక్ ఆఫ్ నంబర్స్ అనే పేరు పెట్టారు. తరువాత, రాజు డేవిడ్ కూడా జనాభా గణనను నిర్వహించినట్లు తెలుస్తోంది. చైనా ప్రపంచంలో అతి పురాతన జనాభా గణన సమాచారం చైనాలో లభించింది. కెనడియన్ ఎన్‌సైక్లోపీడియా ప్రకారం, ఇక్కడ 4,000 సంవత్సరాల క్రితమే జనాభా గణన నమోదు చేయబడింది, ఈ గణనలో 16 మిలియన్ల మంది పౌరులు ఉన్నట్లు గుర్తించారు.[6] మరో జనాభా గణనను హాన్ రాజవంశం హయాంలో గుర్తించారు, ఇది చైనా యొక్క అతి అత్యంత ప్రసిద్ధ పురాతన జనాభా గణనగా గుర్తించబడుతుంది.[7][8] దీనిని 2 ADలో సేకరించారు, అధ్యయనకారులు దీనిని అత్యంత కచ్చితమైన గణనగా పరిగణిస్తున్నారు.[9] ఈ సమయానికి, చైనాలో నమోదిత 12.36 మిలియన్ల గృహాల్లో 57.67 మిలియన్ల మంది ప్రజలు నివసిస్తున్నట్లు తెలుస్తోంది.[10][11][12] మూడో నమోదిత జనాభా గణన 144 ADలో జరిగింది, ఈ సమయంలో లెక్కించిన 9.94 మిలియన్ గృహాల్లో 49.73 మంది పౌరులే నివసిస్తున్నారు. రోమ్ 'సెన్సస్' (జనాభా గణన) అనే పదాన్ని పురాతన రోమ్‌లో మొదటిసారి ఉపయోగించారు, ఈ పేరును లాటిన్ పదమైన 'సెన్సెర్' (దీనర్థం 'అంచనా') నుంచి స్వీకరించారు. రోమన్ సామ్రాజ్యం పరిపాలనలో జనాభా గణన కీలక పాత్ర పోషించింది, దీనిని పన్నులు నిర్ణయించేందుకు ఉపయోగించేవారు (సెన్సార్ (పురాతన రోమ్) వ్యాసాన్ని చూడండి). కొన్ని అంతరాయాలతో, సాధారణంగా జనాభా గణనను ప్రతి ఐదేళ్లకు ఒకసారి నిర్వహించేవారు.[13] ఇది ప్రజలు మరియు వారి ఆస్తిని నమోదు చేసిన పట్టినను అందించింది, దీని నుంచి వారి పన్నులు మరియు హక్కులను నమోదు చేస్తారు. ఈ జనాభా గణనను 6వ శతాబ్దం BCలో రోమన్ చక్రవర్తి సెర్వియస్ టుల్లియస్ ప్రవేశపెట్టినట్లు తెలుస్తోంది [14], ఈ సమయంలో సైనికులుగా 80 వేల మంది పౌరులు ఉన్నట్లు లెక్కించారు [15]. ఉమాయ్యద్ కాలిఫట్ మధ్యయుగంలో, కాలిఫట్ సామ్రాజ్యం ప్రారంభమైనప్పటి నుంచి నియతకాలికంగా జనాభా గణనలు నిర్వహించింది, రెండో రషీదున్ కాలిఫ్ ఉమర్ మొదటి జనాభా గణనకు ఆదేశించారు.[16] మధ్యయుగ ఐరోపా మధ్యయుగ ఐరోపాలో డోమ్స్‌డే బుక్ అత్యంత ప్రసిద్ధ జనాభా గణనగా గుర్తించబడుతుంది, ఈ జనాభా గణనను ఇంగ్లండ్‌కు చెందిన విలియమ్ I నిర్వహించారు, ఆయన కొత్తగా జయించిన భూభాగం నుంచి సరిగా పన్ను వసూలు చేసేందుకు ఈ గణనను నిర్వహించడం జరిగింది. 1183లో, జెరూసలేం సామ్రాజ్యంలో క్రూసేడ్‌ల సంఖ్య కోసం జనాభా గణన జరిగింది, ఈజిప్టు మరియు సిరియా సుల్తాన్ సలాడిన్‌పై తిరుగుబాటుకు ప్రయత్నించే పురుషులు మరియు అందుకు ఉపయోగపడే నగదు పరిమాణాన్ని అంచనా వేసేందుకు ఈ గణనను చేపట్టారు. ఇంకా సామ్రాజ్యం 15వ శతాబ్దంలో, ఇంకా సామ్రాజ్యం జనాభా గణన సమాచారాన్ని సేకరించేందుకు ఒక ప్రత్యేక పద్ధతిని కలిగివుంది. ఇంకా ప్రజలకు ఎటువంటి రాత భాష లేదు, అయితే వారు జనాభా గణనల సమాచారాన్ని నమోదు చేశారు, ఇతర సంఖ్యా సమాచారంతోపాటు, సంఖ్యాయేతర సమాచారాన్ని కూడా క్విపుస్, ఇలామా లేదా అల్పాకా జట్టు దారాలు లేదా పత్తి తాళ్లను సంఖ్యలతో నమోదు చేశారు, ఇతర విలువలను దశాంశ పద్ధతిలో ముడివేయడం ద్వారా గుర్తించేవారు. ఆధునిక అమలు ఆఫ్ఘనిస్థాన్ ఆఫ్ఘనిస్థాన్‌లో 1980లో ఒక పాక్షిక మరియు అసంపూర్ణ జనాభా గణనను సేకరించడం జరిగింది. 2007లో ఒక జనాభా గణన నిర్వహించాల్సి ఉంది.[17] అల్బేనియా అల్బేనియాలో తాజా జనాభా గణనను ఏప్రిల్ 2001లో నిర్వహించారు.[18][19] దీనికి ముందు, 1989లో కమ్యూనిస్ట్ పాలన అంతిమ దశలో జనాభా గణనను నిర్వహించారు. అల్జీరియా అల్జీరియాలో జనాభా మరియు గృహ గణనలను 1967, 1977, 1987, 1998, మరియు 2008 సంవత్సరాల్లో నిర్వహించారు. తరువాతి జనాభా గణన 2016లో జరగనుంది. ఆంటిగ్వా మరియు బార్బుడా జనాభా మరియు గృహ గణనను 2001లో నిర్వహించారు. తరువాతి గణనను 2011లో నిర్వహించనున్నారు. అర్జెంటీనా అర్జెంటీనాలో జాతీయ జనాభా గణనను సుమారుగా ప్రతి పదేళ్లకు ఒకసారి నిర్వహిస్తున్నారు, చివరి జనాభా గణన అక్టోబరు 27, 2010లో జరిగింది. జనాభా గణనకు సంబంధించిన మరింత సమాచారం కోసం: నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ సెన్సస్ ఆఫ్ అర్జెంటీనా వ్యాసాన్ని చూడండి. ఆస్ట్రేలియా ప్రధాన వ్యాసం: Census in Australia ఆస్ట్రేలియా జనాభా గణనను ఆస్ట్రేలియన్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ నిర్వహిస్తుంది. ప్రస్తుతం ఇది ప్రతి ఐదేళ్లకు ఒకసారి జనాభా గణనను నిర్వహిస్తుంది, చివరి జనాభా గణన ఆగస్టు 8, 2006న జరిగింది. గతంలో ఆస్ట్రేలియా జనాభా గణనలు 1911, 1921, 1933, 1947, 1954 సంవత్సరాల్లో జరిగాయి, తరువాత 1961 - 2006 మధ్య కాలంలో ప్రతి ఐదేళ్లకు ఒకసారి వీటిని నిర్వహించారు. 2006లో, మొదటిసారి, ఆస్ట్రేలియన్‌లు తమ జనాభా గణనను పూర్తిగా ఆన్‌లైన్‌లో పూర్తి చేయగలిగారు. ఆస్ట్రియా ఆస్ట్రియా జనాభా గణనను స్టాటిస్టిక్ ఆస్ట్రియా నిర్వహిస్తుంది. ప్రతి పదేళ్లకు ఒకసారి ఆస్ట్రియాలో జనాభా గణనలు జరుగుతాయి, చివరి గణనను 2001లో నిర్వహించారు. అజెర్‌బైజాన్ అజెర్‌బైజాన్‌లో జనాభా గణన సమాచారాన్ని రష్యాన్/సోవియట్ పాలనలో 1897, 1926, 1937, 1939, 1959, 1970, 1979, మరియు 1989 సంవత్సరాల్లో సేకరించడం జరిగింది. అజెర్‌బైజాన్‌లో 1991 నుంచి, మరో రెండు జనాభా గణనలు జరిగాయి; మొదటి 1999లో, రెండోది 2009లో నిర్వహించారు.[20] బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ (BBS) 1974, 1981, 1991 మరియు 2001 సంవత్సరాల్లో దేశంలో జనాభా గణనలను నిర్వహించింది. బార్బడోస్ బార్బడోస్‌లో జనాభా గణనను బార్బడోస్ స్టాటిస్టికల్ సర్వీస్ (BSS) నిర్వహిస్తుంది, చివరి ప్రధాన గణన 2000లో జరిగింది, 2010లో మరోదానిని నిర్వహించనున్నారు. బెనిన్ బెనిన్‌లో జనాభా గణనలు 1978, 1992 మరియు 2002 సంవత్సరాల్లో జరిగాయి. బొలీవియా బొలీవియాలో జనాభా మరియు గృహ గణనలు 1992 మరియు 2001 సంవత్సరాల్లో జరిగాయి. బ్రెజిల్ బ్రెజిల్ జనాభా గణనను బ్రెజిలీయన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ జియోగ్రఫీ అండ్ స్టాటిస్టిక్స్ ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తుంది. చివరి జనాభా గణన 2000లో జరిగింది. గతంలో జనాభా గణనలు 1872 (మొదటిసారి), 1900, 1920, 1941, 1950, 1960, 1970, 1980 మరియు 1991 సంవత్సరాల్లో జరిగాయి. ప్రపంచంలోనే అత్యధిక స్థాయిలో సోపాన క్రమ సేకరణ ఉన్న గణనల్లో బ్రెజిల్ యొక్క జనాభా గణన ఒకటి. దీని యొక్క సోపానక్రమంలో: బ్రెజిల్ (దేశం), ప్రధాన ప్రాంతాలు, రాష్ట్రాలు, స్థూల-ప్రాంతాలు, సూక్ష్మ-ప్రాంతాలు, మున్సిపాలిటీలు, జిల్లాలు, ఉప-జిల్లాలు, పొరుగు ప్రదేశాలు మరియు గణన ప్రదేశాలు భాగంగా ఉన్నాయి. పరిపాలక సోపాన క్రమం ఆధారంగా, కొన్నిరకాల సమాచారాన్ని బహిర్గతం చేయకుండా గోప్యంగా ఉంచుతారు. ఉదాహరణకు: 1. సమాచార సేకరణలో అట్టడుగు స్థాయిలో గణన ప్రాంతాలు ఉంటాయి, 300 గృహాలు ఉన్న ప్రదేశాన్ని గణన ప్రాంతంగా పరిగణిస్తారు, వయస్సు, గృహ పరిస్థితి, లింగం, ఆదాయం మరియు ఇతరాల ప్రాతిపాదికన సమాచారాన్ని సేకరిస్తారు. 2. జిల్లాలు: జాతి, వర్ణం, మతం, అంగవైకల్యం, ఇతరాల ప్రాతిపదికన సమాచారాన్ని సేకరించడం జరుగుతుంది. 3. మున్సిపాలిటీలు (నగరాలు): ఇప్పటికే తెలియజేసిన సమాచారంతోపాటు, అదనంగా GDP, పారిశ్రామిక ఉత్పత్తి, వ్యవసాయ ఉత్పత్తి, చదువు లేదా పనికోసం నగరాల మధ్య వలసలు, జీవనం కోసం జరిగే వలసలు, ద్రవ్యోల్బణం, ఉద్యోగ రోట్లు, పరిశ్రమల సంఖ్య, వ్యాపార నాణ్యత, తదితరాలకు సంబంధించిన సమాచారాన్ని కూడా సేకరిస్తారు. GPS గ్రాహకిలు మరియు డిజిటల్ మ్యాప్‌లు ఉన్న చేతితో తీసుకెళ్లగల కంప్యూటర్‌లతో సమాచారాన్ని సేకరించడం జరుగుతుంది. మరింత సమాచారం కోసం, బ్రెజిలీయన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ జియోగ్రఫీ అండ్ స్టాటిస్టిక్స్ (IBGE) వ్యాసాన్ని చూడండి. బల్గేరియా బల్గేరియా గవర్నర్‌లు బల్గేరియా భూభాగాలకు విముక్తి లభించిన వెంటనే ఒక జాతీయ గణనను నిర్వహించారు. 1881లో రాజ్యంలో జనాభా గణనను నిర్వహించారు, ఇదిలా ఉంటే 1884లో తూర్పు రుమెలియాలో జనాభా గణనను నిర్వహించడం జరిగింది. ఏకీకృత దేశంలో మొట్టమొదటి జనాభా గణన 1888లో జరిగింది. మొదటి గణన తరువాత, బల్గేరియా అధికారిక యంత్రాంగాలు పలుమార్లు జనాభా గణనలు నిర్వహించాయి: 1892, 1900, 1905, 1910, 1920, 1926, 1934, 1946, 1956, 1965, 1975, 1985, 1992 మరియు 2001 సంవత్సరాల్లో జనాభా గణనలు జరిగాయి. 1888 నుంచి రెండో ప్రపంచ యుద్ధం వరకు బల్గేరియా జనాభా గణనలు అందించిన సమాచారం ఆనాటి ప్రమాణాల ప్రకారం అత్యంత కచ్చితమైనదిగా గుర్తింపు పొందింది. ఈ సమయానికి చెందిన బల్గేరియా గణాంక నిపుణులు పశ్చిమదేశాల విశ్వవిద్యాలయాల్లో విద్యావంతులయ్యారు, వీరు అంతర్జాతీయ సహకారంలో విరివిగా పాలుపంచుకున్నారు, తద్వారా ఉత్తమ పద్ధతులను పరిచయం చేయడంలో విజయవంతమయ్యారు. తరువాతి జనాభా గణనల్లో సేకరించిన సమాచార నాణ్యత చర్చనీయాంశంగా మారింది. ఉదాహరణకు, 2001 జనాభా గణనలో మతపరమైన పరిగణన ద్వారా మతేతర బల్గేరియన్‌లు గణన పరిధిలోకి రాలేదు. కెనడా See also: Census in Canada కెనడా జనాభా గణనను స్టాటిస్టిక్స్ కెనడా నిర్వహిస్తుంది. 1666 న్యూ ఫ్రాన్స్ జనాభా గణనను ఫ్రెంచ్ ప్రభుత్వాధికారి జీన్ టాలోన్ నిర్వహించారు, న్యూ ఫ్రాన్స్‌లో నివసిస్తున్న ప్రజల సంఖ్యను అంచనా వేసేందుకు ఈ జనాభా గణనను చేపట్టం జరిగింది. తరువాత 280 సంవత్సరాలకు ఏర్పడిన కెనడా ఆనాటి పద్ధతి మరియు సమాచారాన్ని ఉపయోగించడం గమనార్హం. ప్రావీన్స్‌లు (కొన్నిసార్లు ఇతర ప్రావీన్స్‌లతో కలిసివున్న ప్రావీన్స్‌లు) 19వ శతాబ్దం మరియు దీనికి ముందు జనాభా గణనలు నిర్వహించాయి. 1871లో, కెనడా మొదటి అధికారిక జనాభా గణన నిర్వహించబడింది, దీనిలో నోవా స్కోటియా, ఆంటారియో, న్యూ బ్రున్స్‌విక్ మరియు క్యూబెక్ ప్రాంతాల్లో జనాభాను లెక్కించారు. కెనడాలో జనాభా గణనలను ప్రతి ఐదేళ్లకు ఒకసారి నిర్వహిస్తారు. చివరి రెండు జనాభా గణనలు 2001 మరియు 2006 సంవత్సరాల్లో జరిగాయి. మధ్య-దశాబ్దం (1976, 1986, 1996, తదితరాలు)లో సేకరించిన జనాభా గణనలను పంచవర్ష జనాభా గణనలుగా సూచిస్తారు. ఇతర జనాభా గణనలను దశ వార్షిక జనాభా గణనగా సూచిస్తారు. మొట్టమొదటి పంచవర్ష జనాభా గణనను 1956లో సేకరించారు. 2006 కెనడా జనాభా గణనకు, ప్రజలు మొట్టమొదటిసారి ఆన్‌లైన్‌లో తమ జనాభా గణన ప్రశ్నాపత్రాన్ని ఎంచుకునే వీలు కల్పించారు. పోస్టల్ మెయిల్ (ఒక ప్రీపెయిడ్ ఎన్వలప్ ఉపయోగించడం ద్వారా) మరియు టెలిఫోన్ (800 నెంబర్‌ను ఉపయోగించడం ద్వారా) వంటి మార్గాల్లో కూడా ప్రశ్నాపత్రానికి సమాధానమిచ్చేందుకు ఇతర ప్రత్యామ్నాయాలు కల్పించారు. అల్బెర్టా అల్బెర్టా ప్రావీన్స్‌లో మున్సిపల్ గవర్నమెంట్ యాక్ట్ (MGA)[21] లోని 57వ సెక్షన్ దాని యొక్క మున్సిపాలిటీలకు (పురపాలక సంఘాలు) ఒక నిర్ణీత సంవత్సరంలో సొంత జనాభా గణనలు నిర్వహించే వీలు కల్పిస్తుంది. MGA యొక్క జనాభా నిర్ణయ నిబంధన ప్రకారం నిర్ణీత ఏడాదిలో ఏప్రిల్ 1కు ముందు మరియు జూన్ 30 తరువాత కాకుండా, ఈ మధ్య కాలంలో అధికారిక పురపాలక జనాభా గణనను నిర్వహించాల్సి ఉంటుంది.[22] పురపాలక సంఘాలు తమ జనాభా గణనను అధికారికంగా నిర్వహించాలనుకుంటే, కొత్త జనాభా వివరాలను జనాభా గణన నిర్వహించిన ఏడాది సెప్టెంబరు 1వ తేదీకి ముందు పురపాలక సంఘ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు సమర్పించాల్సి ఉంటుంది[23]. అల్బెర్టా యొక్క పురపాలక సంఘాల తాజా జనాభా గణన వివరాలను మంత్రిత్వ శాఖ యొక్క వార్షిక అధికారిక జనాభా జాబితా[24] ప్రచురణ సంస్థ విడుదల చేస్తుంది. అల్బెర్టా జనాభా వెబ్‌సైట్‌ను ప్రావీన్స్ మరియు స్టాటిస్టిక్స్ కెనడా అందించిన సమాచారం ఆధారంగా రూపొందించారు. ఇది పురపాలక మరియు సమాఖ్య జనాభా గణన ఫలితాలను పురపాలక సంఘాలతో పోలుస్తుంది, పురపాలక సంఘాలవారీగా చారిత్రక జనాభా ధోరణులను విశ్లేషిస్తుంది, తద్వారా సమగ్ర వార్షిక జనాభా వివరాలను వెల్లడిస్తుంది.[25] చిలీ చిలీలో జాతీయ జనాభా గణనలను ప్రతి పదేళ్లకు ఒకసారి INE (Instituto Nacional de Estadísticas, లేదా నేషనల్ స్టాటిస్టిక్స్ ఇన్‌స్టిట్యూట్) నిర్వహిస్తుంది, చివరిసారి జనాభా గణన 2002లో జరిగింది. చైనా రిపబ్లిక్ ఆఫ్ చైనా మరియు పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాలలో జనాభా గణనలను 1913, 1944, 1953, 1964, 1982, 1990, 2000, మరియు 2010 సంవత్సరాల్లో నిర్వహించారు.[26] ప్రపంచంలో అత్యధిక జనాభాగల దేశంలో పురుషులు, మహిళలు మరియు బాలలందరి సంఖ్యను గుర్తించడం ద్వారా ఈ గణనలు ప్రపంచంలోనే అతిపెద్ద జనాభా గణనలుగా గుర్తింపు పొందాయి. 2000 జనాభా గణనలో 6 మిలియన్ల మంది పరిగణకులు పాల్గొన్నారు. తరువాతి జాతీయ జనాభా గణన నవంబరు 1, 2010లో ప్రారంభం కానుంది,[27] ఇదిలా ఉంటే ఒక సన్నాహక గృహ నమోదు అధ్యయనం బీజింగ్‌లో ఆగస్టు 15, 2010న ప్రారంభమైంది.[28] జాతీయ జనాభా గణనల నడుమ, 1% జాతీయ జనాభా నమూనా అధ్యయనాలు 1987, 1995, 2005 సంవత్సరాల్లో జరిగాయి, 2000 నుంచి ప్రతి ఏడాది 0.1% జాతీయ జనాభా నమూనా అధ్యయనాలు జరుగుతున్నాయి.[29] జాతీయ వ్యవసాయ, ఆర్థిక మరియు పారిశ్రామిక గణనలను కూడా నియతకాలికంగా సేకరించడం జరుగుతుంది. మొట్టమొదటి ఆర్థిక గణన 2004లో జరిగింది, రెండోదానిని 2008లో నిర్వహించారు.[30] కోస్టారికా కోస్టారికా 9వ జనాభా గణనను 2000లో నిర్వహించింది. INEC, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ సెన్సస్ నేతృత్వంలో ఇక్కడ జనాభా గణనలు జరుగుతాయి. గతంలో కోస్టారికా జనాభా గణనలు 1864, 1883, 1892, 1927, 1950, 1963, 1973 మరియు 1984 సంవత్సరాల్లో జరిగాయి. చెక్ రిపబ్లిక్ చెక్ రిపబ్లిక్‌లో జనాభా గణనను ప్రతి పదేళ్లకు ఒకసారి చెక్ స్టాటిస్టికల్ ఆఫీస్ నిర్వహిస్తుంది. చివరి జనాభా గణన 2001లో జరిగింది. దీనికి ముందు జనాభా గణనలు 1869, 1880, 1890, 1900, 1910, 1921, 1930, 1950, 1961, 1970, 1980 మరియు 1991 సంవత్సరాల్లో జరిగాయి. డెన్మార్క్ ప్రధాన వ్యాసం: Census in Denmark మొట్టమొదటి డెన్మార్క్ జనాభా గణన 1700-1701లో జరిగింది, దీనిలో యువ పురుషుల జనాభా గణాంకాలు ఉన్నాయి. దీనిలో సగం సమాచారం ఇప్పటికీ భద్రంగా ఉంది. పాఠశాల విద్యార్థుల జనాభా గణాంకాలను 1730వ దశకంలో సేకరించారు. ఈ ప్రారంభ సేకరణలు తరువాత, 1769లో మొట్టమొదటిసారి పూర్తిస్థాయిలో ప్రజలందరితో కూడిన (మహిళలు మరియు పిల్లలతోసహా, వీరిని గతంలో కేవలం సంఖ్యల్లో మాత్రమే నమోదు చేసేవారు) జనాభా గణనను డెన్మార్క్-నార్వే యంత్రాంగం నిర్వహించింది.[31] ఈ సమయంలో రాజ్యంలో 797 584 మంది ప్రజలు నివసిస్తున్నట్లు లెక్కించారు. జార్జి క్రిస్టియన్ ఓయెడెర్ 1771లో గణాంక జనాభా లెక్కలు నిర్వహించారు, కోపెన్‌హాగన్, సజెల్‌ల్యాండ్, మోన్ మరియు బోర్న్‌హోల్మ్‌లలో దీనిని చేపట్టారు. తరువాత, జనాభా గణన కొంతవరకు నియతకాలికంగా జరిగింది, 1787, 1801 మరియు 1834 సంవత్సరాలతోపాటు, 1840 మరియు 1860 మధ్యకాలంలో ప్రతి ఐదేళ్లకు ఒకసారి, 1890 వరకు ప్రతి పదేళ్లకు ఒకసారి జనాభా గణనలు నిర్వహించారు. కోపెన్‌హాగన్ నగరంలో 1885 మరియు 1895 సంవత్సరాల్లో ప్రత్యేక జనాభా గణనలు నిర్వహించారు. 20వ శతాబ్దంలో, జనాభా గణనలను 1901 నుంచి 1921 వరకు ప్రతి ఐదేళ్లకు ఒకసారి, 1930 నుంచి ప్రతి పదేళ్లకు ఒకసారి నిర్వహిస్తున్నారు. చివరి సాంప్రదాయిక జనాభా గణన 1970లో జరిగింది. 1976లో పరిమిత జనాభా గణనను రిజిస్టర్‌ల ఆధారంగా నిర్వహించారు. 1981 నుంచి ప్రతి ఏడాది జనాభా మరియు గృహాల గణనకు సంబంధించిన సమాచారాన్ని రిజిస్టర్‌ల నుంచి సేకరిస్తున్నారు. ప్రపంచంలో పరిపాలక రిజిస్టర్‌ల నుంచి జనాభా గణనలను నిర్వహిస్తున్న మొట్టమొదటి దేశంగా డెన్మార్క్ గుర్తింపు పొందింది. జనాభా పట్టిక (Det Centrale Personregister) మరియు భవన మరియు నివాస పట్టిక మరియు వ్యాపార సంస్థల పట్టికలు ముఖ్యమైన రిజిస్టర్‌లుగా ఉన్నాయి. కేంద్ర గణాంక కార్యాలయం స్టాటిస్టిక్స్ డెన్మార్క్ ఈ సమాచారాన్ని సమీకరంచే బాధ్యత కలిగివుంది. స్టేట్‌బ్యాంక్ డెన్మార్క్‌లో ఈ సమాచారం ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటుంది.[32] డెన్‌స్క్ డెమోగ్రాఫిస్క్ డేటాబేస్‌లో డెన్మార్క్ జనాభా గణనల్లో కొంత భాగాన్ని ఆన్‌లైన్‌లో శోధించే వీలుంది,[33] అంతేకాకుండా ఆర్కివాలియర్ ఆన్‌లైన్‌లో స్కాన్ చేసిన వెర్షన్‌లను చూడవచ్చు.[34] ఈజిప్టు ప్రధాన వ్యాసం: Census in Egypt ఆర్థిక మంత్రిత్వ శాఖ గణాంకాల విభాగం మొట్టమొదటి జనాభా గణనను 1882లో నిర్వహించింది, దీనిని సన్నాహక చర్యగా పరిగణించారు; మొదటి నిజమైన జనాభా గణన 1897లో జరిగింది. ఈ తరువాత నుంచి, ప్రతి పదేళ్లకు ఒకసారి 1907, 1917, 1927 మరియు వరుసగా ఇతర సంవత్సరాల్లో జనాభా గణనలు నిర్వహించారు. ఈస్టోనియా ఈస్టోనియాలో జనాభా గణనలను 1881, 1897, 1922, 1934, 1959, 1970, 1979, 1989 మరియు 2000 సంవత్సరాల్లో సేకరించారు.[35] ఈ దేశంలో జనాభా గణనలను స్టాటిస్టిక్స్ ఈస్టోనియా అనే సంస్థ నిర్వహిస్తుంది.[36] ఇథియోపియా ఇథియోపియాలో మూడు జనాభా గణనలు నిర్వహించారు: 1984, 1994 మరియు 2007 సంవత్సరాల్లో జనాభా గణాంకాలు సేకరించడం జరిగింది. సెంట్రల్ స్టాటిస్టికల్ ఏజెన్సీ ఇక్కడ జనాభా గణనలను నిర్వహిస్తుంది. ఆగస్టు 2007 దేశంలోని దాదాపుగా అన్ని ప్రాంతాల్లో జనాభా గణన నిర్వహించారు, అయితే సోమాలీ ప్రాంతం మరియు అఫార్ ప్రాంతం దీనిని నిర్వహించలేదు. ఉత్తర అఫార్ ప్రాంతం మారుమూలన ఉండటంతోపాటు, తీవ్రమైన వేడితో కూడిన మరియు శుష్క ప్రదేశంగా ఉంది. తూర్పు సోమాలీ ప్రాంతం (ఓగాడెన్)లో ఒక పెద్ద నోమాడిక్ సోమాలీ జనాభా నివసిస్తుంది, అయితే ఇది యుద్ధ భూమిగా ఉంది, ఇక్కడ ఇథియోపియన్ సైనిక దళాలు ఓగాడెన్ నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ (ONLF)పై పోరాడుతున్నాయి. ఫిన్లాండ్ స్వీడన్‌లో భాగంగా ఉన్నప్పుడు ఫిన్లాండ్‌లో 1749లో మొట్టమొదటిసారి జనాభా గణనను నిర్వహించారు. ఫిన్లాండ్‌లో ఇటీవల కాలంలో జనాభా గణన డిసెంబరు 31, 2000న జరిగింది. ఫ్రాన్స్ ఫ్రాన్స్‌లో జనాభా గణనను INSEE నిర్వహిస్తుంది. 2004 నుంచి, పాక్షిక జనాభా గణనను ప్రతి ఏడాది నిర్వహిస్తున్నారు, ఐదేళ్ల కాలంలో సగటులతో ఫలితాలను వెల్లడిస్తున్నారు. జర్మనీ ప్రధాన వ్యాసం: Census in Germany ఐరోపా ఖండంలో మొట్టమొదటి క్రమబద్ధమైన జనాభా గణనను ప్రూసియాలో 1719లో నిర్వహించారు (ఈ ప్రాంతంలో ప్రస్తుతం ఉత్తర జర్మనీ మరియు పశ్చిమ పోలెండ్ భూభాగాలు ఉన్నాయి). జర్మన్ సామ్రాజ్యంలో మొట్టమొదట భారీ-స్థాయి జనాభా గణన 1895లో జరిగింది. అనేక వ్యక్తిగత ప్రశ్నలు అడుగుతున్న కారణంగా, పశ్చిమ జర్మనీలో జనాభా గణనను ప్రవేశపెట్టేందుకు 1980వ దశకంలో చేసిన ప్రయత్నాలకు తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తమైంది. కొందరు దీనిని బహిష్కరించాలని ప్రచారం చేశారు. చివరకు రాజ్యాంగ న్యాయస్థానం 1980 మరియు 1983 సంవత్సరాల్లో జనాభా గణనను నిలిపివేయాలని ఆదేశించింది. చివరి జనాభా గణనను 1987లో నిర్వహించారు. జర్మనీ అప్పటి నుంచి పూర్తిస్థాయి జనాభా గణనకు బదులుగా, గణాంక పద్ధతుల మేళనంతో జనాభా నమూనాలను ఉపయోగిస్తుంది. గ్రీస్ నేషనల్ స్టాటిస్టికల్ సర్వీస్ ఆఫ్ గ్రీస్ ప్రతి పదేళ్లకు ఒకసారి జనాభా గణనను నిర్వహిస్తుంది.[37] చివరి జనాభా గణన 2001లో జరిగింది. గ్వాటెమాల గ్వాటెమాలలో ఆధునిక జనాభా గణనలు 1930, 1950, 1964, 1973, 1981, 1994 మరియు 2002 సంవత్సరాల్లో జరిగాయి. 1950 మరియు 1964 సంవత్సరాల్లో (మాయా జనాభా తప్పుడు వర్గీకరణ) మరియు 1994లో (కచ్చితత్వంపై అనుమానాలు) జనాభా గణనలు వివాదాస్పదమయ్యాయి. జులై 2009నాటికి గ్వాటెమాలలో సుమారుగా 14,000,000 మంది ప్రజలు నివసిస్తున్నారు. మెక్సికో మరియు గ్వాటెమాల సంయుక్త భూభాగాలు, 1577-1585 . మే 25, 1677లో, స్పెయిన్ రాజు ఫిలిప్ II ఇండీస్ ప్రాంతంలో స్పెయిన్ భూభాగాల సాధారణ చిత్రాన్ని సిద్ధం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించిన సమాచార సేకరణ కోసం క్రోనిస్టా మేయర్-కాస్మోగ్రాఫో యొక్క కార్యాలయం 1577లో జారీ చేసిన ఆదేశాలు మరియు ప్రశ్నావళిని న్యూ స్పెయిన్ మరియు పెరూ దేశాల్లోని వైస్రాయ్‌లకు పంపింది. భూభాగ లక్షణాలు మరియు ప్రజల జీవన పరిస్థితుల గురించి ప్రాథమిక సమాచారం సేకరించేందుకు ఈ ప్రశ్నావళిలో యాభై ప్రశ్నలు ఉన్నాయి. "రిలాసియోనెస్ జియోగ్రఫికాస్"గా గుర్తించే సమాధానాలను ఇండీస్‌లోని మండలి 1579 మరియు 1585 మధ్యకాలంలో స్పెయిన్‌లోని క్రోనిస్టా మేయర్-కాస్మోగ్రాఫోకు పంపింది. హాంకాంగ్ ప్రధాన వ్యాసం: Census in Hong Kong హాంకాంగ్ యొక్క సెన్సస్ అండ్ స్టాటిస్టిక్స్ డిపార్ట్‌మెంట్ ప్రతి పదేళ్లకు ఒకసారి జనాభా గణనలను మరియు ప్రతి రెండు జనాభా గణనలు మధ్య ఒక ఉప-జనాభా గణనను నిర్వహిస్తుంది. చివరి జనాభా గణనను 2001లో నిర్వహించారు, చివరి ఉప-జనాభా గణన 2006లో జరిగింది. హంగేరి 1870 నుంచి హంగేరిలో అధికారిక దశ వార్షిక జనాభా గణనలు సేకరించబడుతున్నాయి: ఐక్యరాజ్యసమితి మరియు యూరోపియన్ యూనియన్ యొక్క గణాంక కార్యాలయం సిఫార్సులపై ఇటీవలి జనాభా గణనను 2001లో నిర్వహించారు. 1880 నుంచి హంగేరి జనాభా గణన వ్యవస్థ స్థానిక భాష (ఒక వ్యక్తి బాల్యంలో ఇంటి వద్ద మాట్లాడే మరియు అధ్యయనం సమయంలో మాట్లాడే భాష), వ్యవహారిక భాష (కుటుంబంలో బాగా తరచుగా మాట్లాడే భాష) మరియు ఇతర మాట్లాడే భాషలు ఆధారంగా పనిచేస్తుంది. ఐస్‌ల్యాండ్ మొట్టమొదటి ఐస్‌ల్యాండ్ జనాభా గణన 1703లో జరిగింది, 1700–1701లో జరిగిన మొదటి డెన్మార్క్ జనాభా గణన తరువాత దీనిని నిర్వహించారు. తరువాతి జనాభా గణనలు 1801, 1845 మరియు 1865 సంవత్సరాల్లో నిర్వహించారు. 1703లో నిర్వహించిన జనాభా గణనలో మొట్టమొదటిసారిగా దేశవ్యాప్తంగా పౌరులందరి గణాంకాలు సేకరించడం జరిగింది, ఈ సమాచారంలో వ్యక్తుల పేరు, వయస్సు మరియు సామాజిక హోదాలను నమోదు చేశారు. దీనికి సంబంధించిన సమాచారం అంతా ఇప్పటికీ భద్రంగా ఉంది, అయితే కొన్ని అసలు పత్రాలు మాత్రం కనుమరుగయ్యాయి. 1952లో నేషనల్ రిజిస్ట్రీ (Þjóðskrá ) ఏర్పాటు కావడంతో జనాభా గణన అవసరం లేకుండా పోయింది. ఐస్‌ల్యాండ్‌లో జన్మించిన పౌరులందరూ మరియు కొత్త నివాసులు ఎప్పటికప్పుడు ఈ రిజిస్ట్రీలో నమోదవుతుంటారు. ఒక జాతీయ గుర్తింపు సంఖ్య (కెన్నిటాలా గా పిలుస్తారు)తో వ్యక్తులను రిజిస్ట్రీలో గుర్తిస్తారు, ఈ సంఖ్య వ్యక్తి పుట్టినరోజు రోజునెలఏడాది క్రమంలో ఉంటుంది, దీనికి మరో నాలుగు అదనపు అంకెలు ఉంటాయి, దీనిలో మూడోది నియంత్రణ అంకె, చివరి అంకె వ్యక్తి జన్మించిన శతాబ్దాన్ని సూచిస్తుంది (1900వ శతాబ్దాన్ని సూచించేందుకు 9, 20వ శతాబ్దానికి 0ను ఉపయోగిస్తారు). ఎన్నికల రిజిస్టర్‌కు జాతీయ రిజిస్ట్రీ రెట్టింపు పరిమాణంలో ఉంటుంది. అంతేకాకుండా, అన్ని బ్యాంకు ఖాతాలు యజమాని యొక్క జాతీయ గుర్తింపు సంఖ్యకు అనుసంధానం చేయబడతాయి (కంపెనీలు మరియు సంస్థలకు ప్రత్యేక గుర్తింపు సంఖ్యలు ఉంటాయి. భారతదేశం ప్రధాన వ్యాసం: Demographics of India భారతదేశ జనాభాకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకునేందుకు భారతదేశపు దశవార్షిక జనాభా గణన ప్రాథమిక మూలంగా ఉంది. 2011 జనాభా గణన మానవాళి చరిత్రలో అతిపెద్ద జనాభా గణన కానుంది.[38] భారతదేశంలో ఆధునిక కాలంలో మొట్టమొదటి జనాభా గణనను 1872లో నిర్వహించారు. మొదటి నియతకాలిక జనాభా గణనను 1881లో లార్డ్ రిప్పాన్ ప్రారంభించారు.అప్పటి నుంచి, జనాభా గణనను ప్రతి 10 ఏళ్లకు ఒకసారి నిర్వహిస్తున్నారు. తాజా జనాభా గణన మే 1, 2010న ప్రారంభమైంది. ఈ జనాభా గణనలో దేశంలో ప్రతి పౌరుడి ఛాయాచిత్రం మరియు వేలిముద్రలతో ఒక జాతీయ జనాభా రిజిస్టర్‌ను తయారు చేస్తారు. భారతీయ పౌరులందరికీ ఒక్కో విశేష గుర్తింపు (యునీక్ ID) సంఖ్యలు మరియు జాతీయ గుర్తింపు కార్డులు అందిస్తారు. జనాభా గణనను ఢిల్లీలోని రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్ ఆఫ్ ఇండియా కార్యాలయం నిర్వహిస్తుంది, ఇది భారత ప్రభుత్వ హోం మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుంది, ఈ కార్యాలయాన్ని 1948 భారతదేశ జనాభా గణన చట్టం కింద ఏర్పాటు చేశారు. ఈ చట్టం కేంద్ర ప్రభుత్వానికి జనాభా గణనకు తేదీని నిర్ణయించే, జనాభా గణన పనికి ఏ పౌరుడి సేవలనైనా కోరే అధికారాలను కల్పించింది. అంతేకాకుండా ఈ చట్టం జనాభా గణనకు సంబంధించి ప్రశ్నలకు ప్రతి పౌరుడు నిజాయితీగా సమాధానం ఇవ్వడాన్ని తప్పనిసరి చేసింది. జనాభా గణన ప్రశ్నాపత్రంలోని ప్రశ్నలకు తప్పుడు సమాధానాలు ఇచ్చినవారికి లేదా సమాధానాలు ఇవ్వనివారికి జరిమానాలు విధించే అధికారాన్ని ఈ చట్టం కల్పించింది. ఈ చట్టం యొక్క అత్యంత ముఖ్యమైన నిబంధనల్లో జనాభా గణన ద్వారా సేకరించిన ప్రతి వ్యక్తి సమాచారాన్ని గోప్యంగా ఉంచడం ఒకటి. జనాభా గణన పత్రాల్లో సమాచారాన్ని తనిఖీ చేయడం మరియు ఈ సమాచారాన్ని సాక్ష్యంగా స్వీకరించడం నిషేధించబడింది. జనాభా గణనను రెండు దశల్లో నిర్వహిస్తారు: మొదటి దశలో, గృహాల నమోదు మరియు గృహాల సంఖ్యను గుర్తిస్తారు, రెండో దశలో అసలు జనాభా గణన జరుగుతుంది. జనాభా గణనను ప్రచార పద్ధతిలో నిర్వహిస్తారు. ఈ పద్ధతిలో, దేశంలోని ప్రతి ఇంటిని సంబంధిత సిబ్బంది సందర్శిస్తారు, ప్రత్యేకంగా శిక్షణ పొందిన పరిగణకులు సమాచారాన్ని సేకరిస్తారు. వారు గృహాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తారు, ఉదాహరణకు సభ్యుల సంఖ్య, నీరు మరియు విద్యుత్ సరఫరా, భూమి, వాహనాలు, కంప్యూటర్‌లు మరియు ఇతర ఆస్తులు మరియు సేవల వినియోగానికి సంబంధించిన సమాచారాన్ని దీనిలో సేకరించడం జరుగుతుంది. రెండో దశలో, మొత్తం జనాభాను లెక్కిస్తారు మరియు వ్యక్తులకు సంబంధించిన గణాంకాలను సేకరిస్తారు.[38] జనగణనలో వ్యక్తుల సొంత ప్రకటనను బట్టే వారి కులం నమోదు చేస్తారు.జనగణన సిబ్బందికి కుల ధ్రువీకరణ పత్రాన్ని చూపించాల్సిన అవసరం లేదు. ఇండోనేషియా ఇండోనేషియాలో మొట్టమొదటి జనాభా గణన సమాచారాన్ని 1930లో వలసరాజ్య పాలనా కాలంలో సేకరించారు. దీనికి ముందు, అసంపూర్ణమైన జనాభా గణనను 1920లో నిర్వహించడం జరిగింది. తరువాత నుంచి జనాభా గణనను అనియతకాలికంగా నిర్వహించారు. స్వాతంత్ర్యం తరువాత మొట్టమొదటి జనాభా గణనను 1961లో నిర్వహించారు, దీని తరువాత 1971లో జనాభా గణన జరిగింది. 1980 నుంచి దేశంలో జనాభా గణనను ప్రతి 10 ఏళ్లకు ఒకసారి నిర్వహిస్తున్నారు. వీటి మధ్యలో, ఆర్థిక గణన (ప్రతి పదేళ్లకు, జనాభా గణన తరువాత ఐదేళ్లకు) మరియు వ్యవసాయ గణన (జనాభా గణన తరువాత మూడేళ్లకు)లు కూడా జరుగుతున్నాయి.చివరి జనాభా గణనను మే 2010లో నిర్వహించారు. ఇరాన్ ప్రధాన వ్యాసం: ఇరాన్ జనాభా స్టాటిస్టికల్ సెంటర్ ఆఫ్ ఇరాన్ దేశవ్యాప్తంగా జనాభా మరియు గృహ గణనలు ప్రతి పదేళ్లకు ఒకసారి నిర్వహిస్తుంది, చివరి జనాభా గణనను 2006లో (1385 AP) నిర్వహించారు. ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్‌లో స్టాటిస్టికల్ సెంటర్ ఆఫ్ ఇరాన్ (SCI) చట్టం యొక్క 4వ అధికరణ ఆధారంగా, జనాభా గణనను అధ్యక్ష ఆదేశంపై ప్రతి పదేళ్లకు ఒకసారి నిర్వహించాలి. ఇరాన్‌లో ఇప్పటివరకు ఆరుసార్లు జనాభా గణనలు నిర్వహించారు, అవి 1956, 1966, 1976, 1986, 1996, మరియు 2006 సంవత్సరాల్లో జరిగాయి; అన్ని గణనలను శాస్త్రీయ పద్ధతుల్లో నిర్వహించడం జరిగింది. ఐర్లాండ్ ఐర్లాండ్‌లో జనాభా గణనను సెంట్రల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ నిర్వహిస్తుంది.[39] జనాభా గణనను ప్రతి ఐదేళ్లకు ఒకసారి నిర్వహిస్తున్నారు, ఒకటితో మరియు ఆరుతో ముగిసే సంవత్సరాల్లో తాజా సమగ్ర సమాచారాన్ని సేకరించడం జరుగుతుంది. 1976 జనాభా గణనను వ్యయ-నియంత్రణ చర్యల్లో భాగంగా రద్దు చేశారు, అయితే 1970వ దశకంలో జనాభాలో ప్రధాన మార్పులు సంభవించినట్లు స్పష్టమవడంతో 1979లో ఒక ప్రత్యామ్నాయ జనాభా గణనను నిర్వహించడం జరిగింది.[40] ఫూట్-అండ్-మౌత్ వ్యాధి ప్రబలడంతో 2001లో జరగాల్సిన జనాభా గణనను 2002 వరకు వాయిదా వేశారు.[41] ఏప్రిల్ 23, 2006న ఇటీవలి జనాభా గణన |
About us|Jobs|Help|Disclaimer|Advertising services|Contact us|Sign in|Website map|Search|
GMT+8, 2015-9-11 20:12 , Processed in 0.163721 second(s), 16 queries .