ఆస్కార్ వైల్డ్' (అక్టోబర్ 16, 1854 – నవంబర్ 30, 1900) ఐర్లండుకు చెందిన ఒక నాటక రచయిత, నవలా రచయిత, కవి మరియు కథా రచయిత. ఆయన రచనల్లోని చతురత పాఠకులను ఇట్టే ఆకట్టుకుంటుంది. లండన్ ను విక్టోరియా రాణి పరిపాలించే కాలంలో ఆయన ప్రముఖ రచయితల్లో ఒకడిగానే కాక ఆయన సమకాలికుల్లో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. బాల్యం ఆస్కార్ వైల్డ్ డబ్లిన్ లోని 21, వెస్ట్‌లాండ్ రో అనే ప్రదేశంలో జన్మించాడు. ఒక ఆంగ్లో-ఐరిష్ కుటుంబంలో ఆయన రెండో సంతానంగా జన్మించాడు. ఆయన తల్లిదండ్రులు సర్ విలియం వైల్డ్, జేన్ ఫ్రాంకెస్కా వైల్డ్. జేన ఒక మంచి రచయిత్రి మాత్రమే కాకుండా యంగ్ ఐర్లాండర్స్ అనే ఒక విప్లవ సంస్థకు కవయిత్రిగా కూడా పనిచేసేది. జీవితాంతం ఐరిష్ జాతీయురాలుగానే గడిపింది. [1] సర్ విలియం ఐర్లాండ్ లోనే పేరొందిన కన్ను మరియు చెవి వ్యాధుల స్పెషలిస్టు. 1864 లో వైద్య రంగానికి ఆయన చేసిన సేవలకు గాను బ్రిటిష్ ప్రభుత్వం సర్ బిరుదునిచ్చి సత్కరించింది.[1] ఆయన పురావస్తు శాస్త్రం మీద మరియు జానపదుల మీద కూడా కొన్ని పుస్తకాలు రాశాడు. పేరొందిన వితరణశీలి. ట్రినిటీ కాలేజ్ డబ్లిన్ కు వెనుక ఉన్న లింకన్ ప్లేస్ అనే ప్రదేశంలో ఉన్న డిస్పెన్సరీ లో ఆయన నగరంలోని పేదప్రజలకు ఉచితంగా వైద్యం చేసేవాడు. |
About us|Jobs|Help|Disclaimer|Advertising services|Contact us|Sign in|Website map|Search|
GMT+8, 2015-9-11 20:12 , Processed in 0.150678 second(s), 16 queries .